Adoração na Bíblia: o que é e como adorar a Deus
Na Bíblia, adoração não é um momento do culto nem sinônimo de música: é a resposta total da vida a quem Deus é. O termo bíblico mais comum para adorar significa literalmente "inclinar-se" ou "prostrar-se", indicando submissão e entrega completa do coração.
Essa postura diante do Criador abrange desde a reverência interior até a obediência prática no dia a dia.
Em espírito e em verdade: o culto que Deus procura
Jesus explicou que a verdadeira adoração não depende de um lugar geográfico específico, como templos ou montanhas, mas do interior do ser humano, moldado pela verdade da Palavra. Não é encenação externa, mas uma entrega nascida no coração renovado.
దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి" అని చెప్పారు.(యోహాను సువార్త 4:24)
అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి" అని చెప్పారు.(యోహాను సువార్త 4:23,24)
అప్పుడు యేసు ఆమెతో, "అమ్మా, నన్ను నమ్ము. ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు.(యోహాను సువార్త 4:21-23)
A verdadeira adoração reconhece quem Jesus é e responde com fé e entrega pessoal:
అప్పుడు అతడు, "ప్రభువా, నేను నమ్ముతున్నాను" అని చెప్పి ఆయనను ఆరాధించాడు.(యోహాను సువార్త 9:38)
Jesus demonstrou que a adoração e o serviço pertencem com exclusividade ao Senhor:
అందుకు యేసు, "సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది" అని చెప్పారు.(మత్తయి సువార్త 4:10)
అందుకు యేసు, " ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది" అని జవాబిచ్చారు.(లూకా సువార్త 4:8)
No Novo Testamento, essa entrega culmina no "culto racional", onde o próprio corpo e a rotina são oferecidos a Deus como sacrifício vivo:
కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.(రోమా పత్రిక 12:1)
కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన. ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.(రోమా పత్రిక 12:1,2)
ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి
కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.(రోమా పత్రిక 11:36)
దీని కోసం లేఖనంలో,
"ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను,
ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది,
ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’"
అని వ్రాయబడి ఉంది.(రోమా పత్రిక 14:11)
Louvor e temor nos Salmos
Os Salmos ensinam que o louvor expressa com júbilo aquilo que o coração já reconhece: a santidade, o poder e a bondade do Criador. Há espaço para reverência humilde e também para festa e gratidão.
రండి, సాగిలపడి ఆరాధించుదాం,
మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;(కీర్తనలు 95:6)
యెహోవాను స్తుతించండి.
పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి;
ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి;
ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
బూర ధ్వనితో ఆయనను స్తుతించండి,
సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.
కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి,
తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో,
ఆయనను స్తుతించండి.
ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి.
యెహోవాను స్తుతించండి.(కీర్తనలు 150:1-6)
ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి.
యెహోవాను స్తుతించండి.(కీర్తనలు 150:6)
కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి,
స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి;
ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.(కీర్తనలు 100:4)
యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి;
ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.(కీర్తనలు 29:2)
సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!
ఆయన నామాన్ని కీర్తించండి
ఆయనను స్తుతించి మహిమపరచండి.
దేవునితో ఇలా అనండి, "మీ క్రియలు ఎంత అద్భుతం!
మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి
మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.
సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది;
మీకు స్తుతి పాడతారు
మీ నామాన్ని స్తుతిస్తారు." సెలా(కీర్తనలు 66:1-4)
నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను;
ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది.(కీర్తనలు 66:17)
ప్రభువా, మీరు సృజించిన దేశాలన్నీ వచ్చి
మీ ముందు ఆరాధిస్తారు;
వారు మీ నామానికి కీర్తి తెస్తారు.
మీరు గొప్ప దేవుడు. మీ అద్భుతాలు గొప్పవి;
మీరే ఏకైక దేవుడు.(కీర్తనలు 86:9,10)
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు;
నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.(కీర్తనలు 103:1)
యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;
ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.(కీర్తనలు 105:1)
దేవా, మీరు నా దేవుడు,
నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను;
నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో,
నేను మీ కోసం దప్పిగొన్నాను,
నా శరీరమంతా
మీ కోసం ఆశపడుతుంది.(కీర్తనలు 63:1)
మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం
నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.
నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.(కీర్తనలు 63:3,4)
O reconhecimento da soberania divina
Adorar é proclamar que Deus é digno e que nada se compara à sua majestade. Em toda a Escritura, da consagração de Davi ao cântico celestial do Apocalipse, a adoração exalta o caráter supremo do Senhor.
"ఓ ప్రభువా, మా దేవా!
నీవు సమస్తాన్ని సృష్టించావు,
నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి,
కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి
నీవే యోగ్యుడవు."(ప్రకటన 4:11)
అతడు పెద్ద స్వరంతో, "దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!" అని చెప్పాడు.(ప్రకటన 14:7)
ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు,
కాబట్టి నీకు భయపడని వారు ఎవరు?
నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు?
నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి,
కాబట్టి భూజనులందరు
నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు," అని దేవుని స్తుతించారు.(ప్రకటన 15:4)
Nem anjos nem homens devem receber o culto que pertence somente ao Altíssimo:
యోహాను అనే నేను ఈ సంగతులను విని చూశాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కాని అతడు నాతో, "నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కాబట్టి దేవున్నే ఆరాధించు!" అని చెప్పాడు.(ప్రకటన 22:8,9)
యెహోవా! మహాత్మ్యం, ప్రభావం,
వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి.
ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే.
యెహోవా రాజ్యం మీదే;
మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.(1 దినవృత్తాంతములు 29:11)
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;
ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.
ఇలా మొరపెట్టండి: "దేవా, మా రక్షకా! మమ్మల్ని రక్షించండి;
ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చి, విడిపించండి,
అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం,
మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాము."
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక!
అని అనగానే ప్రజలంతా, "ఆమేన్, యెహోవాకు స్తుతి" అని చెప్పారు.(1 దినవృత్తాంతములు 16:34-36)
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;
ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.(1 దినవృత్తాంతములు 16:34)
ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి;
ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.(1 దినవృత్తాంతములు 16:9)
O plano redentor de Deus culmina na exaltação de Cristo diante de toda a criação:
అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి
అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,
యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు,
పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,
ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది,
తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.(ఫిలిప్పీ పత్రిక 2:9-11)
O sacrifício de louvor contínuo
A adoração cristã não depende de circunstâncias favoráveis. Como fruto de lábios que confessam a Cristo, ela se expressa em gratidão, edificação mútua e comunhão, mesmo em meio à adversidade.
కాబట్టి, యేసు ద్వారా, ఆయన పేరును బహిరంగంగా ఒప్పుకునే పెదవుల ఫలంతో మనం నిరంతరం దేవునికి స్తుతి బలిని అర్పిద్దాము.(హెబ్రీ పత్రిక 13:15)
మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొంటున్నాం కాబట్టి, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం, ఎందుకంటే మన "దేవుడు దహించు అగ్ని."(హెబ్రీ పత్రిక 12:28,29)
సంగీతములతో, కీర్తనలతో ఆత్మ సంబంధమైన పాటలతో, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీ హృదయాలతో పాటలు పాడుతూ సంగీతంతో ప్రభువును గురించి కీర్తిస్తూ,(ఎఫెసీ పత్రిక 5:19)
సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.(కొలొస్సీ పత్రిక 3:16)
సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు.(అపొస్తలుల కార్యములు 16:25)
మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవుడు. దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నారో, అదే ఆదరణతో అలాంటి కష్టాల్లో ఉన్నవారిని ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నారు.(2 కొరింథీ పత్రిక 1:3,4)
తండ్రితో కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడా మాతో చేరేలా మేము చూసినవాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము.(1 యోహాను పత్రిక 1:3)
A busca de Deus em todo o tempo
Quando a adoração se torna um estilo de vida, a alma encontra abrigo seguro no Senhor diante das aflições e das lutas cotidianas.
నా నోరు మీ స్తుతితో నిండి ఉంది;
నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను.(కీర్తనలు 71:8)
దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి,
మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి;
ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి.
తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు,
తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.(కీర్తనలు 68:4,5)
యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను;
మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను.(కీర్తనలు 7:17)
నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను;
సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను.
యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి.
యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి!
ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి.(కీర్తనలు 22:22,23)
మీ వైవు నా చేతులు చాపుతున్నాను;
ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా(కీర్తనలు 143:6)
నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?
దేవుని మీద నిరీక్షణ ఉంచు,
ఆయనే నా రక్షకుడు నా దేవుడు
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.(కీర్తనలు 42:11)
యెహోవాతో నేను, "మీరు నా ప్రభువు;
మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు" అని చెప్తాను.(కీర్తనలు 16:2)
యెహోవాను భయంతో సేవించండి
వణుకుతూ ఆనందించండి.(కీర్తనలు 2:11)
మీలో నేను ఆనందించి సంతోషిస్తాను;
ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను.(కీర్తనలు 9:2)
O perigo da idolatria e do culto vazio
A Bíblia adverte com rigor contra a idolatria e a adoração mecânica. Honrar a Deus apenas com os lábios, enquanto o coração permanece distante e apegado a outros deuses, constitui falsa adoração.
మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.(నిర్గమ 20:5)
మీరు ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు, ఎందుకంటే రోషం గలవాడని పేరుగల యెహోవా, రోషం గల దేవుడు.(నిర్గమ 34:14)
మోషే ఆ గుడారం లోపలికి వెళ్లగానే, మేఘస్తంభం దిగివచ్చి దాని ద్వారం దగ్గర నిలబడేది, అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవారు. ఆ గుడారపు ద్వారం దగ్గర మేఘస్తంభం నిలబడడం ప్రజలు చూసినప్పుడెల్లా, వారంతా లేచి నిలబడి, ప్రతిఒక్కరు తమ గుడారపు ద్వారం దగ్గర యెహోవాను ఆరాధించేవారు.(నిర్గమ 33:9,10)
"యెహోవాయే నా బలము నా పాట;
ఆయన నాకు రక్షణ అయ్యారు.
ఆయన నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తాను,
ఆయన నా తండ్రికి దేవుడు నేనాయనను మహిమపరుస్తాను.(నిర్గమ 15:2)
యెహోవా, దేవుళ్ళ మధ్యలో
మీవంటి వారెవరు?
పరిశుద్ధతలో ఘనమైనవారు
మహిమలో భీకరమైనవారు,
అద్భుతాలు చేసే
మీవంటి వారెవరు?(నిర్గమ 15:11)
మీ దేవుడైన యెహోవాను ఆరాధించండి, ఆయన ఆశీర్వాదం మీ ఆహారం మీద నీటి మీద ఉంటుంది. నేను మీ మధ్య నుండి రోగాన్ని తీసివేస్తాను,(నిర్గమ 23:25)
మీరు స్తుతించవలసింది ఆయననే; మీ కళ్లారా మీరు చూసిన గొప్ప భయంకరమైన అద్భుతాలను మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.(ద్వితీయో 10:21)
మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు, మీ కుటుంబాలు తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి.(ద్వితీయో 12:7)
వారు ఇతర దేవుళ్ళ వల్ల ఆయనకు రోషం పుట్టించారు,
వారి అసహ్యకరమైన విగ్రహాలతో ఆయనకు కోపం కలిగించారు.
దేవుడు కాని దయ్యాలకు వారు బలులర్పించారు
తమకు తెలియని దేవుళ్ళకు,
క్రొత్తగా వచ్చిన దేవుళ్ళకు,
మీ పూర్వికులు లెక్కచెయ్యని దేవుళ్ళకు మ్రొక్కారు.
మీకు తండ్రిగా ఉన్న ఆశ్రయ దుర్గాన్ని మీరు విడిచిపెట్టారు;
మీకు జన్మనిచ్చిన దేవుని మీరు మరచిపోయారు.(ద్వితీయో 32:16-18)
జాగ్రత్తపడండి, లేదా మీరు మోసపోయి ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి సేవిస్తారు.(ద్వితీయో 11:16)
O profeta Isaías expõe a hipocrisia de um ritual sem fidelidade do coração:
ప్రభువు ఇలా అంటున్నారు:
"ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు.
పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు,
కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి.
వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే
నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.(యెషయా 29:13)
యెహోవా, మీరే నా దేవుడు;
నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను,
పరిపూర్ణ నమ్మకత్వంతో
మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన
అద్భుతాలను మీరు చేశారు.(యెషయా 25:1)
అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాల్లో:
" ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు
మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా?
మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు
మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు,
రెఫాను అనే మీ దేవుని నక్షత్రాన్ని పూజించారు.
అందుకే నేను మిమ్మల్ని బబులోను అవతలికి బందీలుగా పంపిస్తాను’ అని వ్రాయబడి ఉంది.(అపొస్తలుల కార్యములు 7:42,43)
ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనుపరుస్తూ మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూసినవాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు. వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది.(కొలొస్సీ పత్రిక 2:18,19)
మిమ్మల్ని ఎవరైనా ఏ రీతిగానైనా మోసపరచనివ్వకండి. ఎందుకంటే తిరుగుబాటు వచ్చేవరకు, నాశనానికి కర్తయైన దుర్మార్గుడు బయటపడే వరకు ఆ దినం రాదు. వాడు దేవునిగా పిలువబడే ప్రతిదాన్ని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చుని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.(2 థెస్సలోనికయులకు 2:3,4)
Adoração nas provações e na história
Ao longo da narrativa bíblica, homens e mulheres adoraram nas situações mais extremas — na perda irreparável, na restauração de um povo ou no reconhecimento do juízo divino. Essa fidelidade demonstra que Deus é digno por quem Ele é, e não apenas pelo que Ele concede.
అప్పుడు యోబు పైకి లేచి తన పైవస్త్రాన్ని చింపుకొని గుండు చేసుకుని అప్పుడు నేలమీద సాష్టాంగపడి ఆరాధిస్తూ, ఇలా అన్నాడు:
"నేను తల్లి గర్భంలోనుండి దిగంబరిగానే వచ్చాను,
దిగంబరిగానే వెళ్తాను.
యెహోవాయే ఇచ్చారు యెహోవాయే తీసుకున్నారు;
యెహోవా నామం స్తుతింపబడును గాక."(యోబు 1:20,21)
కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు:
"ఆయన మంచివారు.
ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది."
యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.(ఎజ్రా 3:11)
ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.(దానియేలు 4:37)
"ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.(2 సమూయేలు 7:22)
"యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు;
మీరు తప్ప మరి ఎవరు లేరు;
మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.(1 సమూయేలు 2:2)
అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు మెట్ల మీద నిలబడి, "లేచి నిలబడండి, మీకు నిత్యం దేవునిగా ఉన్న యెహోవాను స్తుతించండి" అని చెప్పి ఇలా స్తుతించారు:
"మీ దివ్యమైన నామం స్తుతించబడుతుంది. సమస్త ఆశీర్వాదాలకు స్తుతులకు మించి హెచ్చింపబడుతుంది.(నెహెమ్యా 9:5)
అంజూరపు చెట్టు పూత పూయకపోయినా
ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా,
ఒలీవచెట్లు కాపు కాయకపోయినా
పొలాలు పంట ఇవ్వకపోయినా,
దొడ్డిలో గొర్రెలు లేకపోయినా
శాలలో పశువులు లేకపోయినా,
నేను యెహోవాయందు ఆనందిస్తాను,
నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను.(హబక్కూకు 3:17,18)
అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను.(యిర్మీయా 29:12)
దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.(యాకోబు పత్రిక 4:8)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.