Filhos: herança de Deus, criação e valores na Bíblia
Filhos como herança e bênção de Deus
A Bíblia trata os filhos como uma herança do Senhor e uma bênção concedida à família, nunca como um fardo. Eles representam a continuidade da vida e o fruto da generosidade de Deus com o lar.
పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం,
గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు
వీరుని చేతిలో బాణాలవంటివారు.
వారితో తన అంబులపొదిని
నింపుకున్నవాడు ధన్యుడు.
గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు
వారు అవమానం పొందరు.(కీర్తనలు 127:3-5)
యెహోవా పట్ల భయం కలిగి,
ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.
మీరు మీ కష్టార్జితాన్ని తింటారు;
ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
మీ ఇంట్లో మీ భార్య
ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది;
మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు
ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా పట్ల భయం కలవారు
ఈ విధంగా ఆశీర్వదించబడతారు.(కీర్తనలు 128:1-4)
వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు;
యథార్థవంతుల తరం దీవించబడుతుంది.(కీర్తనలు 112:2)
అప్పుడు మా పిల్లలు పెరిగిన మొక్కల్లా,
తమ యవ్వన దశలో ఉంటారు.
మా కుమార్తెలు,
రాజభవనం అలంకరించడం కోసం చెక్కబడిన స్తంభాల్లా ఉంటారు.(కీర్తనలు 144:12)
దేవుడు వారితో, "మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి" అని చెప్పి ఆశీర్వదించారు.(ఆది 1:28)
ఇతర ప్రజలకన్నా అధికంగా మీరు ఆశీర్వదించబడతారు; మీలో పురుషులలో కాని స్త్రీలలో కాని సంతానలేమి ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.(ద్వితీయో 7:14)
మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి.(ద్వితీయో 28:4)
Ensinar o caminho e transmitir a fé
A formação espiritual e moral de uma criança não acontece por acaso: ela exige presença nas tarefas comuns do dia a dia. A Escritura orienta que os pais conversem sobre os mandamentos de Deus dentro de casa e pelo caminho, ensinando antes pelo exemplo do que pelo discurso.
ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి. వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి.(ద్వితీయో 6:6,7)
మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి,
వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.(సామెతలు 22:6)
నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి;
వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.(సామెతలు 4:1)
వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము;
యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను,
ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి
తర్వాతి తరానికి మేము చెప్తాం.(కీర్తనలు 78:4)
Corrigir com sabedoria e sem exasperar
A disciplina bíblica tem como objetivo proteger a vida e moldar o caráter, não descarregar irritação. A firmeza necessária na correção anda sempre junta com a moderação: os pais são advertidos a não irritar nem desanimar os filhos na criação.
బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి
కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు.(సామెతలు 13:24)
యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది,
క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది.(సామెతలు 22:15)
నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము;
ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.(సామెతలు 23:13)
బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది,
కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు.(సామెతలు 29:15)
తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి.(ఎఫెసీ పత్రిక 6:4)
తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి.(కొలొస్సీ పత్రిక 3:21)
మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు? అందరు క్రమశిక్షణ పొందినట్లు మీరు క్రమశిక్షణ పొందకపోతే చట్టబద్ధమైన సంతానం అవ్వరు మీరు నిజమైన కుమారులు కుమార్తెలు కారు.(హెబ్రీ పత్రిక 12:7,8)
O acolhimento e a ternura de Jesus pelas crianças
Jesus deu dignidade e tempo aos pequenos em uma época em que eles costumavam ser postos à margem. Ao repreender os discípulos e abençoar os meninos e meninas, Cristo colocou a simplicidade da infância como padrão para entrar no Reino dos Céus.
యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, "చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము.(మార్కు సువార్త 10:14)
మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారో కదా!(మత్తయి సువార్త 7:11)
యేసు జ్ఞానంలోను వయస్సులోను దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.(లూకా సువార్త 2:52)
తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు,
తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;(కీర్తనలు 103:13)
మనం దేవుని పిల్లలమని పిలువబడునట్లు, తండ్రి ఎంత గొప్ప ప్రేమను మనపై కురిపించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఈ కారణంగానే లోకానికి మనం తెలియదు. ఎందుకంటే దానికి ఆయన తెలియదు.(1 యోహాను పత్రిక 3:1)
ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతుంది; కానీ శిశువు పుట్టగానే తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదనంతా ఆమె మరచిపోతుంది.(యోహాను సువార్త 16:21)
Promessas de cuidado e esperança para as gerações
Deus conhece cada pessoa antes mesmo do nascimento e acompanha o crescimento dos filhos em cada detalhe. A Escritura traz promessas de paz, justiça e renovação que alcançam não apenas o presente, mas as gerações seguintes.
నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;
నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,
అది నాకు పూర్తిగా తెలుసు.
రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,
భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు,
నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.
నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;
నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే
అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.(కీర్తనలు 139:13-16)
"గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు,
నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను;
దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను"
అని చెప్పింది.(యిర్మీయా 1:5)
" ‘ "యెహోవా నిన్ను ఆశీర్వదించి
కాపాడును గాక;
యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి
నిన్ను కరుణించును గాక;
యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక
సమాధానం ఇచ్చును గాక." ’(సంఖ్యా 6:24-26)
నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు,
ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను.
నీ సంతానంపై నా ఆత్మను,
నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.
వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు,
నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.(యెషయా 44:3,4)
యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు
వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.(యెషయా 54:13)
వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. నేను వారికి ఏక హృదయాన్ని ఒకే మార్గాన్ని ఇస్తాను, తద్వార వారు ఎల్లప్పుడూ నాకు భయపడతారు, వారికి, వారి తర్వాత వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు అంతా మేలు జరుగుతుంది.(యిర్మీయా 32:38,39)
నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను;
నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.(కీర్తనలు 22:10)
ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను,
అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం
వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.
వారు ఎల్లప్పుడు దయ గలవారై ఉచితంగా అప్పు ఇస్తారు;
వారి పిల్లలు దీవెనకరంగా ఉంటారు.(కీర్తనలు 37:25,26)
దేవుడు నీకు ఆకాశపు మంచును,
భూమి యొక్క సారాన్ని,
సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.
జనాంగాలు నీకు సేవ చేయాలి,
జనాలు నీకు తలవంచాలి.
నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు,
నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి.
నిన్ను శపించేవారు శపించబడతారు
నిన్ను దీవించే వారు దీవించబడతారు."(ఆది 27:28,29)
బందీలుగా వెళ్తారని మీరు చెప్పిన మంచి చెడు తెలియని మీ పిల్లలు ఆ దేశంలో అడుగుపెడతారు. నేను దానిని వారికి ఇస్తాను, వారు దానిని స్వాధీనం చేసుకుంటారు.(ద్వితీయో 1:39)
O papel dos filhos: honra, respeito e gratidão
O mandamento de honrar pai e mãe é o primeiro que traz uma promessa explícita de vida longa e paz. A resposta dos filhos à dedicação dos pais se expressa pela obediência na juventude e pelo amparo prático na velhice.
మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.(నిర్గమ 20:12)
పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది. "మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు."(ఎఫెసీ పత్రిక 6:1-3)
పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుకు ఇష్టము.(కొలొస్సీ పత్రిక 3:20)
సొలొమోను యొక్క సామెతలు:
జ్ఞానం కలిగిన పిల్లలు తండ్రికి ఆనందం కలిగిస్తారు,
కాని మూర్ఖపు పిల్లలు తమ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తారు.(సామెతలు 10:1)
పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం,
తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.(సామెతలు 17:6)
నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు;
వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.(సామెతలు 20:7)
కాని ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలు గాని ఉంటే, ఆ పిల్లలు ముందుగా తమ కుటుంబంపట్ల శ్రద్ధ వహించడం, తమ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తాము పాటించే ధర్మాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, ఇది దేవుని సంతోషపరుస్తుంది.(1 తిమోతి పత్రిక 5:4)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.