Pular para o conteúdo
Publicidade

Liberdade: o que significa ser livre em Cristo

O que significa ser livre em Cristo

A verdadeira liberdade não é fazer tudo o que dá vontade, mas ser livre da culpa e do pecado por meio de Jesus. Quando Cristo transforma a sua caminhada, o passado perde o poder de condenar o seu presente.

క్రీస్తు మనకు విడుదల ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి; బానిసత్వపు కాడి ద్వారా మీరు మళ్ళీ మీమీద భారాన్ని మోపుకోకండి.(గలతీ పత్రిక 5:1)

అందుకే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా విడుదల పొందినవారిగా ఉంటారు.(యోహాను సువార్త 8:36)

తనను నమ్మిన యూదులతో యేసు, "ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది" అని చెప్పారు.(యోహాను సువార్త 8:31,32)

Livres da condenação e do peso do passado

Carregar erros antigos esgota o coração, mas a graça de Deus encerra essa cobrança. Estar em Cristo significa que as suas falhas não dão a última palavra sobre quem você é.

కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.(రోమా పత్రిక 8:1,2)

అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులయ్యారు. దాని వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.(రోమా పత్రిక 6:22)

"కాబట్టి, నా స్నేహితులారా, యేసు ద్వారానే పాపక్షమాపణ కలుగునని ప్రకటించబడింది అని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారా మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చడం సాధ్యం కాలేదు, కాని క్రీస్తు యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన ద్వారా ప్రతి పాపం నుండి విడుదల పొంది నిర్దోషిగా తీర్చబడుతున్నారు.(అపొస్తలుల కార్యములు 13:38,39)

O Espírito Santo traz paz e acesso ao Pai

Onde o Espírito de Deus está, o medo e o peso religioso perdem força. Você recebe abertura para conversar com Deus em qualquer momento do dia, exatamente como você está.

ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది.(2 కొరింథీ పత్రిక 3:17)

ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము.(ఎఫెసీ పత్రిక 3:12)

"ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,

బీదలకు సువార్త ప్రకటించడానికి,

ఆయన నన్ను అభిషేకించారు;

చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి,

గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి,

బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,(లూకా సువార్త 4:18)

Liberdade para servir, não para tropeçar

Ser livre na fé não é desculpa para se descuidar ou machucar os outros. A liberdade que Jesus dá ensina a fazer escolhas com discernimento e a colocar a vida a serviço do próximo.

నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోండి.(గలతీ పత్రిక 5:13)

"ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని" మీరు అనుకోవచ్చు కాని, అన్ని చేయదగినవి కావు. "ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది అనుకోవచ్చు" కాని, నేను దేనికి లొంగిపోను.(1 కొరింథీ పత్రిక 6:12)

స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి.(1 పేతురు పత్రిక 2:16)

అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి పరిశీలనగా చూసి దానిలో కొనసాగేవారు, విని మరచేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు.(యాకోబు పత్రిక 1:25)

O alívio de quem caminha com Deus

Andar nos caminhos do Senhor não aperta a vida; tira a bagagem desnecessária da alma e devolve a paz no meio das lutas comuns de cada dia.

నేను మీ కట్టడలను వెదికాను,

కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.(కీర్తనలు 119:45)

నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు,

కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు.(కీర్తనలు 34:19)

దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు,

బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు;

కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.(కీర్తనలు 68:6)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.