Pular para o conteúdo
Publicidade

Oração: o que é, como fazer e o que Jesus ensinou

A oração é a conversa direta e sincera entre a pessoa e Deus. Na Bíblia, ela não é uma fórmula mística para dobrar a vontade divina, mas o meio pelo qual expressamos confiança, dependência, gratidão e pedidos ao Pai celestial.

Como Jesus ensinou a orar

Jesus alertou contra dois desvios comuns: a hipocrisia de orar em público para impressionar os outros e o uso de repetições mecânicas, achando que Deus responde pela quantidade de palavras. O Pai já sabe do que você precisa antes mesmo de pedir. No modelo da oração do Pai Nosso, Jesus estabeleceu as prioridades da fé: honrar o nome de Deus, submeter-se ao seu Reino, pedir o sustento diário, confessar pecados e buscar proteção contra o mal.

"మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే వారు సమాజమందిరాల్లోను వీధుల మూలల్లోను నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.(మత్తయి సువార్త 6:5)

అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.(మత్తయి సువార్త 6:6)

మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి. మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి.(మత్తయి సువార్త 6:7,8)

"మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి:

" ‘పరలోకమందున్న మా తండ్రీ,

మీ నామం పరిశుద్ధపరచబడును గాక,

మీ రాజ్యం వచ్చును గాక;

పరలోకంలో జరుగునట్లు భూమి మీద,

మీ చిత్తం జరుగును గాక.

మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.

మా రుణస్థులను మేము క్షమించినట్లు

మా రుణాలను క్షమించండి.

మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి,

దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’(మత్తయి సువార్త 6:9-13)

ఆయన వారితో, "మీరు ప్రార్థన చేసేప్పుడు:

" ‘తండ్రీ,

మీ నామం పరిశుద్ధపరచబడును గాక,

మీ రాజ్యం వచ్చును గాక.

మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.

మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు,

మా పాపాలను క్షమించండి.

మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’"(లూకా సువార్త 11:2-4)

O convite a pedir com insistência e fé

Deus convida seus filhos a trazerem pedidos com liberdade e insistência. Os verbos que Jesus usa — pedir, buscar e bater — indicam persistência contínua, não uma tentativa única. Ele compara o cuidado de Deus com o de pais humanos: se pais imperfeitos dão coisas boas aos seus filhos, com muito mais generosidade o Pai acolhe quem recorre a Ele.

"అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.(మత్తయి సువార్త 7:7,8)

మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారో కదా!(మత్తయి సువార్త 7:11)

"అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.(లూకా సువార్త 11:9,10)

ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు: "ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.

"అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా, ఈ విధవరాలు, "నాకు న్యాయం చేయండి" అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు."

కాబట్టి ప్రభువు దాని గురించి, "అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా? నేను చెప్పేది ఏంటంటే, ఆయన వారికి న్యాయం జరిగేలా చేస్తారు, అది కూడా అతిత్వరలో చేస్తారు. అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమి మీద వారిలో విశ్వాసం కనిపిస్తుందా?" అని అడిగారు.(లూకా సువార్త 18:1-8)

కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు.(మార్కు సువార్త 11:24)

మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు" అని వారితో చెప్పారు.(మత్తయి సువార్త 21:22)

O que significa orar em nome de Jesus

Orar em nome de Jesus não funciona como fórmula mágica ao final de uma frase. No contexto bíblico, o nome representa a autoridade, o caráter e a vontade da pessoa. Pedir em nome de Cristo significa aproximar-se do Pai fundamentado nos méritos de Jesus, alinhando desejos e propósitos àquilo que Ele mesmo ensinou e viveu.

మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను. మీరు నా పేరిట ఏమి అడిగినా నేను చేస్తాను.(యోహాను సువార్త 14:13,14)

మీరు నాలో నిలిచి నా మాటలు మీలో నిలిచి ఉంటే, మీకు ఇష్టమైన దానిని అడగండి, అది మీకు జరుతుంది.(యోహాను సువార్త 15:7)

మీరు నన్ను ఎంచుకోలేదు, కాని నేనే మిమ్మల్ని ఎంచుకుని మీరు వెళ్లి ఫలించాలని మీ ఫలం నిలిచి ఉండాలని మిమ్మల్ని నియమించాను. కాబట్టి మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇవ్వాలని ఇలా చేశాను.(యోహాను సువార్త 15:16)

ఇప్పటివరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది.(యోహాను సువార్త 16:24)

A certeza de que Deus ouve o clamor

A Escritura não esconde momentos de angústia e cansaço. De Davi perseguido no deserto aos profetas no cativeiro, a Bíblia registra clamores sinceros de quem não via saída humana. A resposta nem sempre vem no tempo ou na forma desejada, mas a promessa das Escrituras é que o Senhor não despreza a oração humilde dos que o buscam.

‘నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నీకు తెలియని, నీవు పరిశోధించలేని గొప్ప విషయాలను నీకు చెప్తాను.’(యిర్మీయా 33:3)

అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను.(యిర్మీయా 29:12)

మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.(యిర్మీయా 29:13)

నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను;

సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను.

తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు;

నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.(కీర్తనలు 18:6)

బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు

వారిని చూసి అసహ్యపడలేదు;

ఆయన ముఖం వారి నుండి దాచలేదు.

ఆయన వారి మొర ఆలకించారు.(కీర్తనలు 22:24)

ఆపద్దినాన నన్ను పిలువండి;

నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు."(కీర్తనలు 50:15)

మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు,

ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు.(కీర్తనలు 65:2)

నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను;

ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది.(కీర్తనలు 66:17)

నా హృదయంలో దుష్టత్వం ఉంటే,

ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.

కాని దేవుడు నిశ్చయంగా ఆలకించారు

నా ప్రార్థన విన్నారు.(కీర్తనలు 66:18,19)

దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు;

ఆయన వారి మనవులను త్రోసివేయరు.(కీర్తనలు 102:17)

నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు;

కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.

ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి,

నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.(కీర్తనలు 116:1,2)

ఆయనకు మొరపెట్టు వారందరికి,

నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.(కీర్తనలు 145:18)

యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు.(యెషయా 30:19)

యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి;

ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.(యెషయా 55:6)

వారు మొరపెట్టక ముందే నేను జవాబిస్తాను;

వారు ఇంకా మాట్లాడుతుండగానే నేను వింటాను.(యెషయా 65:24)

A atitude do coração diante de Deus

A oração bíblica exige sinceridade interior. O apóstolo Tiago adverte que pedir motivado por egoísmo ou orar com o coração dividido impede a comunhão com Deus. O Senhor acolhe quem se achega com quebrantamento, disposição para perdoar e desejo sincero de obedecer à sua palavra.

మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.(యాకోబు పత్రిక 1:5-8)

మీరు కోరుకున్నదానిని పొందలేదు కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు కాబట్టి మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు.(యాకోబు పత్రిక 4:2)

దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.(యాకోబు పత్రిక 4:8)

కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందేలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది.(యాకోబు పత్రిక 5:16)

ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే,

వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.(సామెతలు 28:9)

యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి;

నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.(కీర్తనలు 4:3)

యెహోవా ముందు మౌనంగా ఉండు

ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు.

ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు

వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.(కీర్తనలు 37:7)

ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి;

మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి,

ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. సెలా(కీర్తనలు 62:8)

Confiança e submissão à vontade divina

A confiança na oração não significa receber garantias de que todo pedido pessoal será concedido. O próprio Jesus, diante da cruz no Getsêmani, pediu para afastar o sofrimento, mas concluiu submetendo-se à vontade do Pai. Paulo pediu três vezes para ser livre de uma aflição física e recebeu como resposta que a graça divina era suficiente. A fé madura descansa no fato de que Deus sabe o que é melhor, mesmo quando a resposta é diferente da nossa expectativa.

మనం దేవున్ని సమీపిస్తున్నప్పుడు మనకు ఉండే నమ్మకం ఇదే: ఆయన చిత్తప్రకారం మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారు. మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారని మనకు తెలిస్తే, మనం ఆయనను ఏది అడిగామో అది కలిగి ఉన్నామని మనకు తెలుసు.(1 యోహాను పత్రిక 5:14,15)

ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే, మనం అడిగిన ప్రతిదాన్ని ఆయన నుండి పొందుకుంటాము.(1 యోహాను పత్రిక 3:22)

కాబట్టి మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాము.(హెబ్రీ పత్రిక 4:16)

విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కోసం ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.(హెబ్రీ పత్రిక 11:6)

తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.(హెబ్రీ పత్రిక 7:25)

కొంత దూరం వెళ్లి, సాగిలపడి, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు" అని ప్రార్థించారు.(మత్తయి సువార్త 26:39)

దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను. అందుకు, "నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది" అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.(2 కొరింథీ పత్రిక 12:8,9)

O que fazer quando faltam palavras

Em períodos de perda, exaustão ou ansiedade extrema, formular pensamentos pode parecer impossível. O apóstolo Paulo ensina que o Espírito Santo intercede por nós em nossa fraqueza com gemidos que as palavras humanas não conseguem traduzir. Entregar a Deus o que aflige o coração, sem máscaras, substitui a inquietação pela paz de Cristo.

అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు.(రోమా పత్రిక 8:26,27)

దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది.(ఫిలిప్పీ పత్రిక 4:6,7)

నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు.(ఫిలిప్పీ పత్రిక 4:19)

సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం

నేను బాధలో మొరపెడతాను,

ఆయన నా స్వరం వింటారు.(కీర్తనలు 55:17)

దేవా, మీరు నా దేవుడు,

నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను;

నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో,

నేను మీ కోసం దప్పిగొన్నాను,

నా శరీరమంతా

మీ కోసం ఆశపడుతుంది.(కీర్తనలు 63:1)

Orar sem cessar no dia a dia

O mandamento de "orar sem cessar" não exige isolamento do mundo nem repetições intermináveis. Trata-se de cultivar uma atitude contínua de dependência, integrando Deus nas decisões do trabalho, na vida em família e nas tensões cotidianas. Essa oração também se expressa em comunidade, sustentando uns aos outros em intercessão, gratidão e louvor.

ఎల్లప్పుడు ఆనందించండి; విడువక ప్రార్థించండి, మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.(1 థెస్సలోనికయులకు 5:16-18)

ఆత్మలో అన్ని సందర్భాలలో అన్ని రకాల ప్రార్థనలతో విన్నపాలతో ప్రార్థించండి. దీన్ని మనస్సులో ఉంచుకొని, మెలకువగా ఉండి పరిశుద్ధులందరి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి.(ఎఫెసీ పత్రిక 6:18)

నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.(రోమా పత్రిక 12:12)

కాబట్టి ప్రతిచోట పురుషులు పవిత్రమైన చేతులను పైకెత్తి, కోపం లేదా కలహభావం లేకుండా ప్రార్థించాలని నేను కోరుతున్నాను.(1 తిమోతి పత్రిక 2:8)

"మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.(మత్తయి సువార్త 18:18)

ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకుని ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను" అని చెప్పారు.(మత్తయి సువార్త 18:20)

"అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.(లూకా సువార్త 6:27,28)

వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియైన మరియ, ఆయన తమ్ముళ్ళు కలిసి, ఏకమనస్సుతో విడువక ప్రార్థిస్తున్నారు.(అపొస్తలుల కార్యములు 1:14)

సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు.(అపొస్తలుల కార్యములు 16:25)

అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.(1 పేతురు పత్రిక 4:7)

మనలో పని చేసి తన శక్తినిబట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి,(ఎఫెసీ పత్రిక 3:20)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.