Pular para o conteúdo
Publicidade

Superação: o que a Bíblia diz sobre vencer crises

Na Bíblia, superação não significa ausência de dor ou força de vontade própria, mas a certeza de que nenhuma aflição tem a palavra final sobre quem confia em Deus. Quem atravessa crises, perdas ou tentações encontra nas Escrituras a promessa de sustento presente e vitória garantida em Cristo.

A vitória que já foi conquistada em Cristo

A esperança cristã não parte da ilusão de que a vida será fácil, mas da declaração de Jesus de que o mundo já foi vencido. Em meio às maiores provações, a vitória do crente está ancorada no que Cristo já realizou na cruz e na ressurreição.

"ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను" అన్నారు.(యోహాను సువార్త 16:33)

అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.(రోమా పత్రిక 8:37)

అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.(1 కొరింథీ పత్రిక 15:57)

నిజానికి, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మినవారు మాత్రమే కదా.(1 యోహాను పత్రిక 5:3-5)

వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి,

తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి

అపవాది మీద విజయం పొందారు;

వారు చావడానికి వెనుకంజ వేయలేదు

తమ ప్రాణాలను ప్రేమించలేదు.(ప్రకటన 12:11)

Vencer o mal com o bem

A superação bíblica contraria a lógica da vingança e do desespero. Diante de injustiças, conflitos e oposições, a resposta do discípulo é o perdão, a retidão e o amor prático, desarmando o mal pela raiz.

ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది.(యోహాను సువార్త 1:5)

మీరు క్షమించేవారిని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కోసమే క్రీస్తును బట్టి క్షమిస్తాను. సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.(2 కొరింథీ పత్రిక 2:10,11)

కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.(2 కొరింథీ పత్రిక 2:14)

జయించేవారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను. నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను.(ప్రకటన 3:5)

నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించినవారిని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోనిస్తాను.(ప్రకటన 3:21)

De onde vem a força para não desistir

Quando os recursos humanos se esgotam e o medo ameaça paralisar, a Bíblia ensina a colocar a confiança não na própria capacidade, mas no socorro divino. Deus se apresenta como refúgio seguro e escudo em meio às tempestades.

యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ

నేను ఎవరికి భయపడతాను?

దేవుడే నా జీవితానికి బలమైన కోట

నేను ఎవరికి భయపడతాను?(కీర్తనలు 27:1)

కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా,

నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.(కీర్తనలు 3:3)

మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు,

మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు.

మా విరోధులపై మాకు విజయమిచ్చేది మీరే,

మీరే పగవారికి సిగ్గుపడేలా చేశారు.

దేవుని యందు మేము దినమంతా అతిశయిస్తాం

మీ నామాన్ని నిత్యం స్తుతిస్తాము. సెలా(కీర్తనలు 44:6-8)

యెహోవా, మమ్మల్ని రక్షించండి!

యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!

యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!

యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.(కీర్తనలు 118:25,26)

చూడండి, మీ దేవుడైన యెహోవా మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లుగా, వెళ్లి దానిని స్వాధీనపరచుకోండి. భయపడకండి; అధైర్యపడకండి" అని చెప్పాను.(ద్వితీయో 1:21)

శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు."(ద్వితీయో 20:4)

మీరు స్థిరమైన మనస్సుగల వారిని

సంపూర్ణ సమాధానంతో కాపాడతారు,

ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.(యెషయా 26:3)

ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు.(1 యోహాను పత్రిక 4:4)

Resistir às tentações e armadilhas da caminhada

Superar também é vencer as batalhas interiores contra o pecado, o desânimo e os impulsos destrutivos. A Escritura oferece armas espirituais — a verdade, a vigilância e a oração — e garante que nenhuma tentação ultrapassa o limite da graça concedida para resistir.

చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎందుకంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, కాని పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకపు శక్తులతో ఆకాశమండలంలో ఉన్న దురాత్మల బలగాలతో వ్యతిరేకంగా పోరాడుతున్నాము. అందుకే ఆపద రోజున మీరు వారిని ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని, పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి. వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.(ఎఫెసీ పత్రిక 6:10-17)

మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి, మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.(ఎఫెసీ పత్రిక 4:22-24)

"మీ కోపంలో పాపం చేయకండి": సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి.(ఎఫెసీ పత్రిక 4:26,27)

శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.

దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, "నేను దేవుని చేత శోధించబడుతున్నాను" అని అనకూడదు. ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురై శోధించబడతారు. చెడు కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పండి మరణానికి జన్మనిస్తుంది.(యాకోబు పత్రిక 1:12-15)

కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.(యాకోబు పత్రిక 4:7,8)

ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.(యాకోబు పత్రిక 4:10)

సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.(1 కొరింథీ పత్రిక 10:13)

మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసుకుని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు. వేశ్యతో కలిసేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడని మీకు తెలియదా? వాక్యంలో, "వారిద్దరు ఏకశరీరం అవుతారు" అని వ్రాయబడి ఉంది కదా! అయితే ప్రభువుతో ఏకమైనవారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.

లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్నీ శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. మీ శరీరాన్ని దేవుడే ఇచ్చారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. మీరు వెలపెట్టి కొనబడ్డారు. కాబట్టి మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.(1 కొరింథీ పత్రిక 6:15-20)

కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు. శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.(గలతీ పత్రిక 5:16,17)

అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.(1 తిమోతి పత్రిక 6:9)

విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.(1 తిమోతి పత్రిక 6:12)

ఇదిగో, పాములను, తేళ్ళను త్రొక్కడానికి, శత్రు బలమంతటిని జయించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను; ఏవి మీకు ఏమాత్రం హాని చేయవు.(లూకా సువార్త 10:19)

భోజనమైన తర్వాత ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. వారు అక్కడ చేరిన తర్వాత, ఆయన వారితో, "మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి" అని చెప్పారు.(లూకా సువార్త 22:40)

ఆయన వారితో, "మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో పడిపోకుండా లేచి ప్రార్థన చేయండి" అని చెప్పారు.(లూకా సువార్త 22:46)

మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం" అని చెప్పారు.(మార్కు సువార్త 14:38)

ప్రియ పిల్లలారా, ఆయన నామంలో మీ పాపాలు క్షమించబడ్డాయి,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

యవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించారు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు,

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

యవ్వనస్థులారా, మీరు బలవంతులు,

దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది;

మీరు దుష్టుని జయించారు;

కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ వారిలో ఉండదు.(1 యోహాను పత్రిక 2:12-15)

సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కాబట్టి పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు.(1 యోహాను పత్రిక 3:8)

Perseverar até o fim olhando para Jesus

A vida cristã é comparada a uma corrida de longa distância, que exige desapego de embaraços e foco constante naquele que iniciou a caminhada. Mesmo sob cansaço severo, a fidelidade de Deus guarda os passos até a linha de chegada.

కాబట్టి, ఇంత గొప్ప సాక్షిసమూహం మన చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి, మనకు ఆటంకం కలిగించే సమస్తాన్ని, సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెడదాము. విశ్వాసానికి కర్తయైన దాన్ని పరిపూర్ణం చేసేవాడైన యేసువైపు చూస్తూ,(హెబ్రీ పత్రిక 12:1)

పాపుల నుండి అలాంటి వ్యతిరేకతను భరించిన వ్యక్తిని గురించి ఆలోచించండి, తద్వారా మీరు అలసట చెందరు, మీ హృదయాలు క్రుంగిపోవు.(హెబ్రీ పత్రిక 12:3)

ఆయన మానవునిగా శోధించబడినప్పుడు బాధను అనుభవించారు కాబట్టి శోధించబడుతున్న వారికి ఆయన సహాయం చేయగలరు.(హెబ్రీ పత్రిక 2:18)

మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.

తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.(1 పేతురు పత్రిక 5:8-10)

దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు.(రోమా పత్రిక 8:28)

క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా?(రోమా పత్రిక 8:35)

అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.(2 థెస్సలోనికయులకు 3:3)

నాకు కలిగే ప్రతి కీడు నుండి ప్రభువు నన్ను కాపాడి తన పరలోక రాజ్యంలోనికి క్షేమంగా చేర్చుకుంటారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.(2 తిమోతి పత్రిక 4:18)

O descanso prometido aos sobrecarregados

Superação não é sinônimo de exaustão contínua. Para quem carrega fardos pesados demais, o convite de Cristo é parar de lutar sozinho e encontrar descanso e refrigério na Sua presença fiel.

"భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరందరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.(మత్తయి సువార్త 11:28)

మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు,

"నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను;

నిన్ను ఎన్నడు త్రోసివేయను."(హెబ్రీ పత్రిక 13:5)

సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు!

యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి!

ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు

దీనుడిగా గాడిద మీద,

గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ

మీ దగ్గరకు వస్తున్నాడు.(జెకర్యా 9:9)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.