8 అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.
ఏలీయా కొండ గృహలో దాక్కోవడం
9 అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా "ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్" అని అతనిని అడిగాడు.
11 యెహోవా అతనితో "నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు" అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. 12 ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది.
13 ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు "ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?" అనే మాట వినిపించింది.