Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 16:6,7,11-13

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

6 వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి "నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు" అని అనుకున్నాడు. 7 అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. "అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు."

11 "నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?" అని యెష్షయిని అడిగాడు. అతడు "ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు" అని చెప్పాడు. అందుకు సమూయేలు "నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా" అని యెష్షయితో చెప్పాడు.

12 యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే "నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు" అని యెహోవా చెప్పగానే, 13 సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలీయాబును చూసి, "ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు" అనుకున్నాడు.

    7 అయితే యెహోవా సమూయేలుతో, "అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు" అన్నారు.

    11 నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు.

    అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు.

    అందుకు సమూయేలు, "అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము" అన్నాడు.

    12 కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు.

    అప్పుడు యెహోవా, "నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు" అన్నారు.

    13 కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.