Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 21:1-6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

దావీదు నోబులో

1 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి "నువ్వు ఒంటరిగా వచ్చావెందుకు?" అని అడిగాడు, 2 దావీదు "రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్న పని ఎలాటిదో అది ఎవ్వరితో చెప్పవద్దు’ అన్నాడు. ఒక చోటికి వెళ్ళమని యువకులకు నేను చెప్పాను. 3 తినడానికి నీ దగ్గర ఏం ఉన్నాయి? ఐదు రొట్టెలు గానీ ఇంకా ఏమైనా ఉంటే అవి నాకు ఇవ్వు" అని యాజకుడైన అహీమెలెకును అడిగాడు. 4 యాజకుడు "మామూలు రొట్టెలు నా దగ్గర లేవు. పవిత్రమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. పనివాళ్ళు స్త్రీలకు దూరంగా ఉన్నట్టైతే వారు ప్రతిష్ఠితమైన రొట్టెలు తినవచ్చు" అని దావీదుతో అన్నాడు.

5 అప్పుడు దావీదు "మేము బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు నిజంగా స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివాళ్ళ బట్టలు పవిత్రంగానే ఉన్నాయి. ఒకవేళ మేము చేయబోయే పని అపవిత్రమైనదైతే ఏంటి? రాజాజ్ఞ బట్టి అది పవిత్రంగా ఎంచబడుతుంది" అని యాజకునితో అన్నాడు. 6 అప్పుడు యెహోవా సన్నిధానం నుండి తీసిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేనందువల్ల, వేడిగా రొట్టెలు చేసే రోజున తీసిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అయితే అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి, "నీతో ఎవరూ లేకుండా నీవు ఒక్కడివే వచ్చావెందుకు?" అని అతన్ని అడిగాడు.

    2 అందుకు దావీదు యాజకుడైన అహీమెలెకుతో, "రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నిన్ను పంపిన పని గురించి ఎవరికి తెలియకూడదు’ అన్నాడు. నేను నా మనుష్యులతో ఒక చోటికి వెళ్లి అక్కడ ఉండమని చెప్పాను. 3 నీ దగ్గర ఏముంది? అయిదు రొట్టెలు గాని మరేమైనా గాని ఉంటే అవి నాకు ఇవ్వు" అన్నాడు.

    4 ఆ యాజకుడు దావీదుతో, "సాధారణ రొట్టె నా దగ్గర లేదు; నీ మనుష్యులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ఇక్కడ ఉన్న ప్రతిష్ఠిత రొట్టెలు తినవచ్చు" అని చెప్పాడు.

    5 అందుకు దావీదు, "ఖచ్చితంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. వారి దేహాలు పవిత్రంగానే ఉన్నాయి. సాధారణ పనిమీద వెళ్లినప్పుడే ఈ మనుష్యులు పవిత్రంగా ఉంటే, ఈ రోజు ఇంకెంత పవిత్రంగా ఉంటారు!" 6 యాజకుడు అతనికి వెచ్చని రొట్టెలు వేసే రోజున తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప వేరే లేవు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.