Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 21:10-13

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

దావీదు గాతులో

10 దావీదు సౌలుకు భయపడినందువల్ల ఆ రోజునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. 11 ఆకీషు సేవకులు "ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా" అని అతని గురించి రాజుతో చెబుతుంటే, 12 దావీదు ఈ మాటలను తన మనస్సులో పెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.

13 అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    10 దావీదు సౌలుకు భయపడి ఆ రోజే బయలుదేరి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరకు వచ్చాడు. 11 అయితే ఆకీషు సేవకులు అతనితో, "ఈ దావీదు ఆ దేశపు రాజు కాదా? వారు నాట్యం చేస్తూ పాటలు పాడుతూ,

    " ‘సౌలు వేలమందిని చంపాడు.

    దావీదు పదివేలమందిని చంపారని చెప్పింది ఇతని గురించే కదా’?"

    అన్నారు.

    12 దావీదు ఈ మాటలు గుర్తుపెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు. 13 కాబట్టి దావీదు వారి ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివానిలా నటిస్తూ గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మి తన గడ్డం మీదికి కారనిస్తుండేవాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి చేష్టలు చేస్తుండేవాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.