Pular para o conteúdo
Publicidade

తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1-6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

ప్రార్థన, స్త్రీపురుషులకై దైవక్రమం

1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం, 2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.

3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. 4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.

5 దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు. 6 ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1,2 అన్నిటికంటే ప్రాముఖ్యంగా, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అందరి పక్షంగా అనగా రాజుల కోసం అధికారంలో ఉన్న వారందరి కోసం దేవునికి విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు చెల్లిస్తే, మనం పూర్ణ భక్తి, పరిశుద్ధత కలిగి శాంతి సమాధానాలతో ప్రశాంతంగా జీవించగలము. 3 ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి. 4 ప్రజలందరు సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 5 ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు. 6 ఆయనే ప్రజలందరి రక్షణ కోసం విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకున్నారు. దీని గురించి సరియైన సమయంలో సాక్ష్యం ఇవ్వబడుతుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.