Pular para o conteúdo
Publicidade

తిమోతికి రాసిన రెండవ పత్రిక 1:5-7

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

5 నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోనూ, మీ అమ్మ యునీకేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం.

6 ఆ కారణంగానే నేను నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను. 7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    5 నీలో ఉన్న యథార్థమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, అది మొదట నీ అమ్మమ్మ లోయిలోను తర్వాత నీ తల్లియైన యునీకేలో ఉండింది. ఆ విశ్వాసమే ఇప్పుడు నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను.

    6 ఈ కారణంగానే, నేను నీపై చేతులు ఉంచడం వలన నీవు పొందిన దేవుని కృపా వరాన్ని మరింత రగిలించి వృద్ధి చేయమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 దేవుడు మనకు పిరికితనాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు కాని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo