33 ప్రజల్లో జ్ఞానం గల వారు ఆనేకులకు అవగాహన కలిగిస్తారు గాని వారు చాలా రోజులు కత్తి వల్ల, అగ్ని వల్ల కూలి, చెరసాల పాలవుతారు. వారికున్నదంతా దోచుకోవడం జరుగుతుంది. 34 వారి కష్టకాలంలో వారికి కొద్దిపాటి సహాయం మాత్రం దొరుకుతుంది. చాలా మంది వారి వైపు చేరతారు గానీ వారివన్నీ శుష్క ప్రియాలే. 35 కొందరు జ్ఞానవంతులు తొట్రుపడతారుగానీ అది వారు అంతం వచ్చేలోపు మరింత మెరుగు పడేందుకు, శుభ్రం అయేందుకు, పవిత్రులయేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నియమించిన కాలం ఇంకా రాలేదు.
Publicidade
దానియేలు 11:33-35
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
33 "ప్రజల్లో జ్ఞానులు చాలామందికి ఉపదేశిస్తారు, కాని వారు ఖడ్గం చేత గాని దహించబడడం వల్ల గాని చెరపట్టబడడం వల్ల గాని దోపిడికి గురికావడం వల్ల గాని హతమవుతారు. 34 వారు పడిపోయినప్పుడు, వారు కొద్ది సహాయం పొందుకుంటారు, అయితే చాలామంది నిజాయితీ లేనివారు వారితో చేరుతారు. 35 అంత్యకాలం కోసం శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, మచ్చలేని వారిగా చేయబడడానికి జ్ఞానులలో కొంతమంది పడిపోతారు, ఎందుకంటే, నిర్ణీత సమయంలో అంతం వస్తుంది.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.