Pular para o conteúdo
Publicidade

దానియేలు 7:13,14,27

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

13 రాత్రి కలిగిన దర్శనాలను నేనింకా చూస్తుండగా,

ఆకాశ మేఘాలపై వస్తున్న మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చాడు.

ఆ మహా వృద్ధుని సన్నిధిలో ప్రవేశించాడు.

ఆయన సముఖానికి అతణ్ణి తీసుకు వచ్చారు.

14 సకల ప్రజలు, రాష్ట్రాలు, వివిధ భాషలు మాటలాడేవారు ఆయన్ని సేవించేలా ప్రభుత్వం,

మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడింది.

ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు.

ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు.

27 ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం,

మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి.

ఆయన రాజ్యం నిత్యం నిలిచేది.

అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు.

ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    13 "రాత్రి దర్శనంలో నేను చూస్తుండగా మనుష్యకుమారునిలా ఉన్న ఒక వ్యక్తి మేఘాల మీద నా ముందుకు వచ్చాడు. అతడు మహా వృద్ధుని సముఖంలోకి వచ్చాడు. 14 ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.

    27 అప్పుడు ఆకాశం క్రిందున్న అన్ని రాజ్యాల అధికారం, శక్తి, మహాత్యం, సర్వోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వతం రాజ్యం, అధికారులందరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు లోబడతారు.’

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.