Pular para o conteúdo
Publicidade

దానియేలు 7:9-11

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

9 నేను ఇంకా చూస్తూ ఉండగా,

ఇంకా సింహాసనాలను వేయడం చూశాను.

మహా వృద్ధుడు కూర్చున్నాడు.

ఆయన వస్త్రం మంచులాగా తెల్లగా,

ఆయన జుత్తు శుద్ధమైన గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉన్నాయి.

ఆయన సింహాసనం అగ్నిజ్వాలల్లాగా మండుతూ ఉంది.

దాని చక్రాలు మంటల్లాగా ఉన్నాయి.

10 అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది.

వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు.

కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు.

తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.

11 అప్పుడు నేను చూస్తుంటే, ఆ కొమ్ము పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడింది. తరువాత దాని కళేబరాన్ని మంటల్లో వేశారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    9 "నేను చూస్తుండగా,

    "సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి,

    వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు.

    ఆయన వస్త్రం మంచులా తెల్లగా,

    ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి.

    ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది,

    దాని చక్రాలు మండుతూ ఉన్నాయి.

    10 ఆయన ఎదుట నుండి

    అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది,

    వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు;

    పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు,

    న్యాయసభ మొదలైంది,

    గ్రంధాలు విప్పారు.

    11 "అప్పుడు నేను చూస్తుండగా ఆ చిన్న కొమ్ము గర్వంగా మాట్లాడినందుకు ఆ జంతువు చంపబడింది. దాని శవం నాశనం చేయబడి మండుతున్న అగ్నిలో పడవేయబడింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.