Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 26:1,7,14,15,31,33

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

సన్నిధి గుడారం

1 "నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్త వర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి.

7 మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.

14 ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేసి, దాన్ని సీలు జంతువు తోళ్లతో కప్పాలి.

15 మందిరానికి తుమ్మ చెక్కతో నిలువు పలకలు చెయ్యాలి.

31 నీవు నీల ధూమ్ర రక్త వర్ణాల సన్న నారతో నేసిన ఒక అడ్డ తెరను చెయ్యాలి. అది కళాకారుని నైపుణ్యంతో కెరూబు ఆధార నమూనాగా చెయ్యాలి. 33 ఆ అడ్డతెరను ఆ కొక్కేల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెర లోపలికి తేవాలి. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 "పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేయాలి. వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి, వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లాలి.

    7 "సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేయాలి. 14 గుడారం కోసం ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో పైకప్పును, దానిపైన మన్నికైన తోళ్లతో26:14 బహుశ పాలిచ్చే పెద్ద నీటి జంతువుల తోళ్ళు 25:5 కూడా చూడండి పైకప్పు తయారుచేయాలి.

    15 "సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేయాలి.

    31 "నీలం ఊదా ఎరుపు రంగుల్లో పేనిన సన్నని నారతో ఒక తెరను చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించాలి. 33 ఆ తెరను కొలుకుల క్రింద తగిలించి నిబంధన మందసాన్ని ఆ తెర వెనుక ఉంచాలి. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.