2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి "ఈమె నా చెల్లి" అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు.
5 ‘ఈమె నా చెల్లి’ అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా ‘అతడు నా అన్న’ అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను" అన్నాడు.
11 అబ్రాహాము "ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేసాను 12 అదీకాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది. 13 దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో ‘మనం వెళ్ళే ప్రతి స్థలం లోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే’ అని చెప్పాను" అన్నాడు.