Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 27:35,36,41

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

35 ఇస్సాకు "నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు" అన్నాడు.

36 ఏశావు ఇలా అన్నాడు. "27:36 అంటే మడిమ పట్టుకుని లాగే వాడు. మోసగాడు.యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకు పోయాడు." ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని "నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా?" అని అడిగాడు.

41 యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. "నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను."

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    35 అయితే అతడు, "నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు" అన్నాడు.

    36 ఏశావు, "అతనికి యాకోబు27:36 యాకోబు అంటే అతడు మడిమెను పట్టుకుంటాడు హెబ్రీ భాషషైలిలో అతడు మోసం చేస్తాడు. అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?" అని అడిగాడు.

    41 తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెనను బట్టి ఏశావు తన సోదరుని మీద పగబెట్టుకున్నాడు, "నా తండ్రిని గురించి దుఃఖించే రోజులు సమీపంగా ఉన్నాయి; తర్వాత నా సోదరుడైన యాకోబును చంపేస్తా" అని తనకు తాను అనుకున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.