Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 3:1,6,15,20

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

మానవ అవిధేయత, పాపం ప్రవేశం.

1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో "నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?" అన్నాడు.

6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

15 నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు" అన్నాడు.

20 ఆదాము తన భార్యకు హవ్వ3:20 హవ్వ అంటే జీవం అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి కలది. సర్పం స్త్రీతో, "దేవుడు, ‘తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు’ అని నిజంగా చెప్పారా?" అని అడిగింది.

    6 స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు.

    15 నేను నీకు స్త్రీకి మధ్య,

    నీ సంతానానికి3:15 లేదా విత్తనం స్త్రీ సంతానానికి మధ్య

    శత్రుత్వం కలుగజేస్తాను;

    అతడు నీ తలను చితకగొడతాడు,3:15 లేదా నలిపివేస్తాడు

    నీవు అతని మడిమె మీద కాటేస్తావు"

    అని అన్నారు.

    20 ఆదాము3:20 లేదా మనుష్యుడు తన భార్యకు హవ్వ3:20 హవ్వ అంటే బహుశ జీవం అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.