Pular para o conteúdo
Publicidade

ఆదికాండం 50:15,17,19-21

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

యోసేపు తన అన్నలను మరో మారు క్షమించడం

15 యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి "ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేస్తాడేమో" అనుకున్నారు. 17 "మన తండ్రి తన మరణానికి ముందు మీరు యోసేపుతో, ‘నీ సోదరులు నీకు కీడు చేశారు. వారిని, వారి అపరాధాన్నీ దయచేసి క్షమించు’ అని చెప్పమన్నాడు" అని అతనితో చెప్పారు.

19 యోసేపు "భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా? 20 మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. 21 కాబట్టి భయపడవద్దు. నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషిస్తాను" అని చెప్పి వారిని ఆదరించి వారితో ఇష్టంగా మాట్లాడాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    15 తమ తండ్రి చనిపోయాడని యోసేపు సోదరులు చూసి, "ఒకవేళ యోసేపు మనపై కక్ష పెట్టుకుని మనం చేసిన తప్పులకు ప్రతి కీడు చేస్తే ఎలా?" అని అనుకున్నారు. 17 ‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు." వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు.

    19 అయితే యోసేపు వారితో, "భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా? 20 మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు. 21 కాబట్టి ఇప్పుడు భయపడకండి. నేను మీకు, మీ పిల్లలకు సమకూరుస్తాను" అని అన్నాడు. అతడు వారికి మళ్ళీ అభయమిచ్చి దయతో మాట్లాడాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.