(4) చరిత్ర పురుషుడైన మెల్కీసెదెకు క్రీస్తుకు ముంగుర్తు
1 రాజులను హతమార్చి తిరిగి వస్తున్న అబ్రాహామును షాలేం పట్టణానికి రాజైన మెల్కీసెదెకు కలుసుకుని ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము తాను యుద్ధంలో పట్టుకున్న వాటిలో పదవ వంతు అతనికి ఇచ్చాడు. "మెల్కీసెదెకు" అనే అతని పేరుకు నీతికి రాజు అనీ, ఇంకా, "షాలేం రాజు", అంటే శాంతికి రాజు అనీ అర్థం.
మెల్కీసెదెకు యాజకత్వం అహరోను యాజకత్వం కన్నా గొప్పది. ఎందుకంటే అహరోను అబ్రాహాములో ఉండి మెల్కీసెదెకుకు పదవభాగం సమర్పించాడు
4 ఇప్పుడు ఇతడెంత గొప్పవాడో గమనించండి. మన పూర్వికుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్ఠమైన వస్తువుల్లో పదోవంతు ఇతనికి ఇచ్చాడు.
9 ఒక రకంగా చెప్పాలంటే పదోవంతు కానుకలను స్వీకరించిన లేవీ తాను కూడా అబ్రాహాము ద్వారా పదవ వంతు కానుకలు ఇచ్చాడు. 10 ఇది ఎలాగంటే, లేవీ అబ్రాహాము నుండే రావాలి కాబట్టి, అబ్రాహాము మెల్కీసెదెకుకు కానుక ఇచ్చినప్పుడు అతని గర్భవాసంలో లేవీ ఉన్నాడు.