Pular para o conteúdo
Publicidade

హబక్కూకు 1:2-4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

2 "యెహోవా, నేను సహాయం కోసం మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు?

బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షించడం లేదు.

3 నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు?

బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు?

ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి.

జగడం, కలహం రేగుతున్నాయి.

4 అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది.

న్యాయం జరగకుండా ఆగిపోయింది.

భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు.

న్యాయం చెడిపోతున్నది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    2 యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా,

    ఎంతకాలం వినకుండా ఉంటావు?

    "హింస!" జరుగుతుందని నీకు మొరపెట్టినా

    ఎంతకాలం రక్షించకుండ ఉంటావు?

    3 నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు?

    తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు?

    నాశనం హింస నా ముందే ఉన్నాయి;

    కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి.

    4 అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది,

    ఎప్పుడూ న్యాయం జరగడం లేదు.

    దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు,

    న్యాయం చెడిపోతుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Habacuque
Ver todos os capítulos de Habacuque