Pular para o conteúdo
Publicidade

యెషయా 52

1 సీయోనూ! లే! నీ బలం తెచ్చుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ అందమైన బట్టలు వేసుకో. ఇక ఎన్నటికీ సున్నతి పొందని వాడొకడైనా, అపవిత్రుడొకడైనా నీ లోపలికి రాడు.

2 ధూళి దులుపుకో. యెరూషలేమా, లేచి చక్కగా కూర్చో. బందీ అయిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసుకో.

3 యెహోవా ఇలా చెబుతున్నాడు "మిమ్మల్ని ఉచితంగా అమ్మేశారు గదా! ఉచితంగానే మీకు విమోచన వస్తుంది."

4 యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. "తాత్కాలికంగా మొదట్లో నా ప్రజలు ఐగుప్తు వెళ్ళారు. ఈ మధ్యే అష్షూరు వారిని బాధించింది."

5 ఇదే యెహోవా వాక్కు. "ఏ కారణం లేకుండా నా ప్రజలను తీసుకుపోయారు. వారి మీద అధికారం చేసేవాళ్ళు పరిహాసం చేస్తున్నారు.52:5 పరిహాసం చేస్తున్నారు. ఏడుస్తున్నారు రోజంతా నా పేరు దూషణకు గురి అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నేనేం చేయాలి?"

6 ఇదే యెహోవా వాక్కు. "నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు. ఈ విషయం చెప్పింది నేనే అని వాళ్ళు ఆ రోజు తెలుసుకుంటారు. ఔను. నేనే."

7 సువార్త ప్రకటిస్తూ శాంతిసమాధానాలు చాటిస్తూ శుభ సమాచారం తెస్తూ విడుదల సమాచారం తీసుకు వచ్చే వారి పాదాలు "నీ దేవుడు పరిపాలిస్తున్నాడు" అని సీయోనుతో చెప్పే వారి పాదాలు పర్వతాల మీద ఎంతో అందంగా ఉన్నాయి.

8 విను! నీ కావలివారు తమ గొంతు పెంచుతున్నారు. వాళ్ళంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు.

9 యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు.

10 అన్ని రాజ్యాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం బయలుపరచాడు. ప్రపంచమంతా మన దేవుని రక్షణ చూస్తారు.

11 అక్కడ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి, వెళ్ళండి. అపవిత్రమైన దేనినీ తాకవద్దు. యెహోవా సేవాపాత్రలను మోసే మీరు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి.

12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోయేలా వెళ్లరు. యెహోవా మీ ముందు నడుస్తాడు. ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కావలివాడుగా ఉంటాడు.

యెహోవా సేవకుని మహిమ, బాధలు

13 వినండి. నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు. అన్నీ చక్కగా జరిగిస్తాడు. ఆయన్ని హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం అధికంగా ఘనపరచడం జరుగుతుంది.

14 అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు.

15 అయితే ఆయన అనేక రాజ్యాలను ఆశ్చర్యపరుస్తాడు. రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు. ఎందుకంటే తమకు చెప్పని విషయాలు వారు చూస్తారు. అంతకు మునుపు వాళ్ళు వినని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.