Pular para o conteúdo
Publicidade

యెషయా 58:3-7

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

3 "మేమెందుకు ఉపవాసమున్నాం? నువ్వెందుకు చూడవు? మమ్మల్ని మేము ఎందుకు తగ్గించుకున్నాం? నువ్వు గమనించలేదు" అని వాళ్ళు అంటారు.

మీ ఉపవాస దినాన మీరు మీకిష్టం వచ్చినట్టు చేస్తూ మీ పనివాళ్ళను కఠినంగా చూస్తారు.

4 మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు.

మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.

5 నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా?

ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా?

6 నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే,

దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం,

అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.

7 ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం.

దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    3 వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా

    మీరెందుకు చూడరు?

    మమ్మల్ని మేము తగ్గించుకుంటే

    మీరెందుకు గమనించరు?’

    "అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు

    మీ పనివారినందరిని దోచుకున్నారు.

    4 మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో,

    ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది.

    మీ స్వరం పరలోకంలో వినపడాలని

    మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.

    5 ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది?

    మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా?

    ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని

    గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా?

    యెహోవాకు ఇష్టమైన ఉపవాసం

    ఇదేనని మీరనుకుంటున్నారా?

    6 "నేను కోరుకునే ఉపవాసం

    అన్యాయపు సంకెళ్ళను విప్పడం,

    బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం,

    బాధించబడిన వారిని విడిపించడం,

    ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?

    7 మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం,

    ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం,

    మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం,

    మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.