Pular para o conteúdo
Publicidade

యోబు 38:4,8,31,41

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.

8 సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు?

31 కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా?

41 కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    4 "నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు?

    నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.

    8 "భూగర్భం నుండి సముద్రం పొంగి వచ్చినప్పుడు

    తలుపుల వెనుక దానిని మూసి ఉంచింది ఎవరు?

    31 "కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో38:31 మూ. భా.లో అందంతో బంధించగలవా?

    మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?

    41 కాకిపిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు

    ఆహారం లేక తిరుగుతున్నప్పుడు

    కాకికి ఆహారం ఇచ్చేది ఎవరు?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.