Pular para o conteúdo
Publicidade

యోవేలు 2:12-17

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

పశ్చాతపనికి పిలుపు

12 యెహోవా ఇలా అంటున్నాడు,

"ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ

హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి."

13 మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.

త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.

శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.

కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక

మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.

14 ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో.

మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని,

పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?

15 సీయోనులో బాకా ఊదండి.

ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.

16 ప్రజలను సమకూర్చండి.

సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి.

పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి.

పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి,

పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.

17 యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు

మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి.

"యెహోవా, నీ ప్రజలను కనికరించు.

నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు.

వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు.

వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?"

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    12 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,

    "ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ

    మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి."

    13 మీ వస్త్రాలను కాదు,

    మీ హృదయాలను చీల్చుకుని,

    మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి,

    ఆయన కృపా కనికరం గలవాడు,

    త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు

    ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు.

    14 ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో,

    ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు,

    మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు

    భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు?

    15 సీయోనులో బూర ఊదండి,

    పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి,

    పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి.

    16 ప్రజలను సమకూర్చండి,

    సమావేశాన్ని ప్రతిష్ఠించండి;

    పెద్దలను రప్పించండి,

    పిల్లలను సమకూర్చండి,

    చంటి పిల్లలను కూడా తీసుకురండి.

    పెళ్ళికుమారుడు తన గదిని

    పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి.

    17 యెహోవా ఎదుట సేవచేసే యాజకులు

    మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి.

    వారు, "యెహోవా! మీ ప్రజలను కనికరించండి.

    మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి

    వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు.

    ‘వీరి దేవుడు ఎక్కడ?’

    అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Joel
Ver todos os capítulos de Joel