Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన సువార్త 1:35-40

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య

35 మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36 అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, "ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల" అన్నాడు.

37 అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు. 38 యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, "మీకేం కావాలి?" అని అడిగాడు. వారు, "రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?" అని అడిగారు. 39 ఆయన, "వచ్చి చూడండి" అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.

40 యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    35 మరుసటిరోజు యోహాను తన ఇద్దరి శిష్యులతో ఉన్నాడు. 36 అతడు నడచి వెళ్తున్న యేసు చూసి, "చూడండి, దేవుని గొర్రెపిల్ల!" అని చెప్పాడు.

    37 అతడు చెప్పిన మాటలు విన్న ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు. 38 యేసు వెనుకకు తిరిగి, తనను వెంబడిస్తున్న వారిని చూసి, "మీకు ఏమి కావాలి?" అని అడిగారు.

    అందుకు వారు, "రబ్బీ, నీవు ఎక్కడ నివసిస్తున్నావు?" అని అడిగారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థము.

    39 ఆయన, "వచ్చి చూడండి" అని చెప్పారు.

    కాబట్టి వారు వెళ్లి ఆయన ఉన్నచోటును చూసి, ఆ రోజంతా ఆయనతో గడిపారు. అప్పటికి సాయంకాలం సుమారు నాలుగు గంటలైంది.

    40 యోహాను మాటలు విని యేసును వెంబడించిన ఇద్దరిలో ఒకడు అంద్రెయ అతడు సీమోను పేతురుకు సోదరుడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.