Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన సువార్త 1:35-51

యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య

35 మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36 అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, "ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల" అన్నాడు.

37 అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు. 38 యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, "మీకేం కావాలి?" అని అడిగాడు. వారు, "రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?" అని అడిగారు. 39 ఆయన, "వచ్చి చూడండి" అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.

40 యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు. 41 ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, "మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం" అని చెప్పాడు. 42 యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, "నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు" అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).

43 మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, "నా వెనకే రా" అన్నాడు. 44 ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. 45 ఫిలిప్పు నతనయేలును చూసి, "ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు" అని చెప్పాడు.

46 దానికి నతనయేలు, "నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?" అన్నాడు. ఫిలిప్పు, "నువ్వే వచ్చి చూడు" అన్నాడు. 47 నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, "చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు" అన్నాడు. 48 అప్పుడు నతనయేలు, "నేను నీకెలా తెలుసు?" అన్నాడు. అందుకు యేసు, "ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను" అన్నాడు.

49 దానికి నతనయేలు, "బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే" అని ఆయనకు బదులిచ్చాడు. 50 అందుకు యేసు, "ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు" అన్నాడు. 51 తరువాత యేసు ఇలా అన్నాడు, "నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.