కానా పెండ్లి – మొదటి అద్భుతకార్యం
1 మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. 2 ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు.
3 విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, "వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది" అని చెప్పింది.