యేసుక్రీస్తు పునరుత్థానం
1 ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది.
యేసు మగ్దలేనే మరియకు ప్రత్యక్షం కావడం
11 కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది.
14 ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు.
16 అప్పుడు యేసు ఆమెను చూసి, "మరియా" అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, "రబ్బూనీ" అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం. 17 యేసు ఆమెతో, "నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు" అన్నాడు. 18 మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, "నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు" అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.
లూకా 24:36-49