Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన సువార్త 20:24,25

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

తోమా ఉండగా యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం

24 పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి "దిదుమ" అని పిలిచే వాళ్ళు. 25 మిగిలిన శిష్యులు, "మేము ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    24 పన్నెండుమంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు. 25 కాబట్టి మిగతా శిష్యులు అతనితో, "మేము ప్రభువును చూశాం" అని చెప్పారు.

    అప్పుడు అతడు వారితో, "నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.