25 మిగిలిన శిష్యులు, "మేము ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు.
27 తరువాత ఆయన తోమాను చూసి, "నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు.