Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 14:1-4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

సంసోను ఫిలిష్తీ యువతితో వివాహం

1 సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు. 2 అతడు ఇంటికి తిరిగి వచ్చి "తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి" అని తన తల్లిదండ్రులను అడిగాడు. 3 వారు "నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?" అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను "ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు" అని తన తండ్రితో అన్నాడు. 4 అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 సంసోను తిమ్నాకు వెళ్లాడు, అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు. 2 అతడు తిరగి వచ్చి, తన తండ్రితో, తల్లితో, "నేను తిమ్నాలో ఒక ఫిలిష్తీ యువతిని చూశాను; ఇప్పుడు ఆమెను నాకు భార్యగా తీసుకురండి" అని అన్నాడు.

    3 అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, "నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?" అన్నారు.

    కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, "నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది." 4 (ఇది యెహోవా నుండి వచ్చిందని, ఫిలిష్తీయులను ఎదుర్కొనే అవకాశం కోసం ఆయన చూస్తున్నారని అతని తల్లిదండ్రులకు తెలియదు; ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు.)

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.