Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 16:23-27

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

సంసోను ప్రతీకారం, మరణం

23 ఫిలిష్తీయుల అధికారులు "మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు" అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు. 24 అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి "మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకులను చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు" అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు. 25 వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు "సంసోనును తీసుకు రండి. అతణ్ణి చూసి ఎగతాళి చేసి నవ్వుదాం" అన్నారు. వాళ్ళు అతణ్ణి తీసుకు వచ్చి రెండు స్తంభాల మధ్య అతణ్ణి నిలబెట్టారు.

26 సంసోను తన చెయ్యి పట్టుకుని ఉన్న కుర్రాడితో "ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను" అన్నాడు. 27 ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    23 ఫిలిష్తీయుల నాయకులు, "మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతికప్పగించాడు" అని చెప్పుకుంటూ తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలిగా అర్పించి పండుగ చేసుకోడానికి ఒకచోట చేరారు.

    24 ఆ ప్రజలు అతన్ని చూసి,

    "మన దేవుడు మన శత్రువును

    మన చేతులకు అప్పగించాడు,

    మన దేశాన్ని పాడు చేసినవాన్ని,

    మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు"

    తమ దేవున్ని పొగిడారు,

    25 వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి, "మనకు వినోదం కలిగించడానికి సంసోనును బయటకు తీసుకురండి!" అని కేకలు వేశారు. వారు సంసోనును చెరసాల నుండి పిలిపించి వారి ముందు నిలబెట్టినప్పుడు అతడు వారికి వినోదం కలిగించాడు.

    వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు, 26 తన చేయి పట్టుకున్న దాసునితో సంసోను, "ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నేను వాటిని ఆనుకుని నిలబడతాను" అని అడిగాడు. 27 ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయింది. ఫిలిష్తీయుల నాయకులందరు అక్కడే ఉన్నారు, సంసోను చేస్తున్న వినోదాన్ని గుడి కప్పు మీది నుండి దాదాపు మూడువేలమంది స్త్రీ పురుషులు చూస్తున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.