18 దేవదూతతో జెకర్యా, "ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు" అన్నాడు 19 దూత, "నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు. 20 నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు" అని అతనితో అన్నాడు.
Publicidade
లూకా రాసిన సువార్త 1:18-20
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
18 అందుకు జెకర్యా ఆ దూతతో, "ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది" అన్నాడు.
19 అందుకు ఆ దూత అతనితో, "నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను. 20 నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కాబట్టి నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు" అన్నాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.