Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 17:28-33

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

28 లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. 29 అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.

30 "అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. 31 ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు. 32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    28 "లోతు దినాల్లో జరిగినట్టే జరుగుతుంది. ప్రజలు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ మొక్కలు నాటుతూ, ఇళ్ళు కడుతున్నారు. 29 కానీ లోతు సొదొమ గ్రామం విడిచి వెళ్లిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి వారందరు నాశనం అయ్యారు.

    30 "మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది. 31 ఆ రోజు ఇంటిపైన ఉన్నవారెవరు ఇంట్లోనుండి తమ వస్తువులను తెచ్చుకోవడానికి క్రిందికి దిగి వెళ్లకూడదు. అలాగే పొలంలో ఉన్నవారు ఏమైనా తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు. 32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దాన్ని పోగొట్టుకుంటారు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవారు దాన్ని కాపాడుకుంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.