Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 21:1-4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

వితంతువు వేసిన కానుక. దేవునికి ఇవ్వడం గురించి యేసు అభిప్రాయం

1 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు. 2 ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు. 3 అప్పుడాయన "ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను. 4 వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది" అని వారితో చెప్పాడు.

మత్తయి 24-25; మార్కు 13

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 దేవాలయ కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను యేసు గమనించి చూస్తున్నారు. 2,3 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, "నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. 4 వీరందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు. కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది" అని అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.