Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 3:10-14

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

10 అప్పుడు గుంపులో కొంతమంది, "అయితే మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు. 11 అతడు, "రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి" అని చెప్పాడు. 12 పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, "బోధకా, మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు. 13 అతడు, "మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు" అని వారితో చెప్పాడు.

14 "మా సంగతేంటి? మేమేం చేయాలి?" అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. "ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి" అని అతడు వారితో చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    10 అందుకు జనసమూహం, "అయితే మేము ఏమి చేయాలి?" అని అడిగారు.

    11 అందుకు యోహాను, "రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి" అన్నాడు.

    12 పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, "బోధకుడా, మేము ఏమి చేయాలి?" అని అడిగారు.

    13 అందుకు అతడు వారితో, "మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు" అని చెప్పాడు.

    14 తర్వాత కొందరు సైనికులు వచ్చి, "మేము ఏమి చేయాలి?" అని అడిగారు.

    అందుకతడు, "ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి" అని వారితో చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.