11 అతడు, "రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి" అని చెప్పాడు. 13 అతడు, "మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు" అని వారితో చెప్పాడు.
14 "మా సంగతేంటి? మేమేం చేయాలి?" అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. "ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి" అని అతడు వారితో చెప్పాడు.