Pular para o conteúdo
Publicidade

విలాప వాక్యములు 3:21-26

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

21 కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

24 "యెహోవా నా వారసత్వం" అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

25 తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.

26 యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    21 అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను,

    కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:

    22 యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు,

    ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.

    23 ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి;

    మీ నమ్మకత్వం గొప్పది.

    24 నాలో నేను, "యెహోవా నా స్వాస్థ్యం;

    కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను"

    అని అనుకుంటున్నాను.

    25 తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి,

    తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;

    26 యెహోవా రక్షణ కోసం

    ఓపికతో వేచి ఉండడం మంచిది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Lamentações
Ver todos os capítulos de Lamentações