2 "నువ్వు నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, అతడు పరిహార స్థానమైన నిబంధన మందసం మూత ముందున్న తెరల్లో ఉన్న అతి పవిత్ర స్థలం లోకి అన్ని సమయాల్లో ప్రవేశించకూడదు. అతడు ప్రవేశిస్తే చనిపోతాడు. ఎందుకంటే నేను నిబంధన మందసం మూత పైన మేఘంలో కనిపిస్తాను.
12 ఆ తరువాత అహరోను యెహోవా సమక్షంలో ఉన్న ధూపం వేసే పళ్ళెం తీసుకుని దాన్ని బలిపీఠం పైన ఉన్ననిప్పులతో పూర్తిగా నింపి, రెండు గుప్పిళ్ళలో పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెరల లోపలికి తీసుకురావాలి. 13 యెహోవా సమక్షంలో నిబంధన ఆజ్ఞల మందసం పైన ఉన్న మూత పైగా ధూమం కమ్ముకునేలా సాంబ్రాణిని నిప్పులపై వేయాలి. అతనికి మరణం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.
14 తరువాత అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత తీసుకుని దాన్ని ఆ మూత పైన తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. కొంత రక్తం తీసుకుని తన వేలితో ఆ మూత పైన ఏడు సార్లు చిలకరించాలి.
15 అప్పుడు ప్రజలర్పించే పాపం కోసం బలిగా మేకని వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకు రావాలి. కోడె దూడ రక్తంతో చేసినట్టే మేక రక్తంతోనూ చేయాలి. దాని రక్తాన్ని మందసం మూత ఎదుటా దాని పైనా చిలకరించాలి.
34 ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి పరిహారం చేయాలి. ఇది మీకు శాశ్వతమైన శాసనం." యెహోవా ఆదేశించిన ప్రకారం మోషే చేసాడు.