ధన సంపాదన గురించి హెచ్చరికలు
23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, "ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం" అని అన్నాడు. 24 ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, "పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం! 25 ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం" అన్నాడు.
26 ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు "అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?" అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. 27 యేసు వారి వైపు చూసి, "మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే" అన్నాడు.