సన్హెడ్రిన్ ఎదుటా, ప్రధాన యాజకుని ఎదుటా యేసు
53 వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. 55 ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు.
61 కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, "నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?" అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు. 62 అప్పుడు యేసు, "నేనే.
మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం,
పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు" అన్నాడు.
63 ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, "ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? 64 ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?" అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు.