Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 6:14-16

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

హేరోదు ఇబ్బంది, యోహాను వధ

14 యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు. 15 ఇతరులు, "ఈయన ఏలీయా" అన్నారు. ఇంకొందరు, "పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్త" అన్నారు. 16 కాని, హేరోదైతే, "నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    14 యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, "బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి" అని చెప్తున్నారు.

    15 మరికొందరు, "ఈయన ఏలీయా" అన్నారు.

    ఇంకొందరు, "ఈయన పూర్వకాల ప్రవక్తల్లో ఒక ప్రవక్తలాంటివాడు" అని చెప్పుకొన్నారు.

    16 అయితే హేరోదు ఇదంతా విని, "నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!" అనుకున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.