Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 10:1-4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

యేసు పన్నెండు మందిని పంపించడం

1 ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.

2 ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను. 3 ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, 4 కనానీయుడు సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 యేసు పన్నెండుమంది శిష్యులను దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి, అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చారు.

    2 ఆ పన్నెండుమంది అపొస్తలుల పేర్లు:

    మొదట పేతురు అని పిలువబడే సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ,

    జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను,

    3 ఫిలిప్పు, బర్తలోమయి,

    తోమా, పన్ను వసూలు చేసే మత్తయి,

    అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి;

    4 జెలోతే అని పిలువబడిన10:4 జెలోతే అంటే మతాభిమాని లేదా అత్యాసక్తి కలవాడు లేదా కనానీయుడైన సీమోను సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.