Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 15:24-28

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

24 దానికి ఆయన, "దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు" అని జవాబిచ్చాడు. 25 అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, "ప్రభూ, నాకు సహాయం చెయ్యి" అంది. 26 ఆయన, "పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు" అని ఆమెతో అన్నాడు. 27 ఆమె, "ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా" అంది.

28 అందుకు యేసు, "నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది" అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.

మార్కు 7:31-37

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    24 అందుకు యేసు, "నేను ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను" అని చెప్పారు.

    25 ఆ స్త్రీ వచ్చి ఆయన ముందు మోకరించి, "ప్రభువా, నాకు సహాయం చేయమని" అడిగింది.

    26 అందుకు యేసు, "పిల్లల రొట్టెలను తీసుకుని, కుక్కలకు వేయడం సరికాదు" అన్నారు.

    27 అప్పుడు ఆమె, "నిజమే ప్రభువా, కానీ కుక్కలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలను తింటాయి కదా!" అని చెప్పింది.

    28 అందుకు యేసు, "అమ్మా, నీకు ఉన్న నమ్మకం చాలా గొప్పది! నీవు కోరినట్టే నీకు జరుగును గాక!" అని ఆమెతో చెప్పారు. ఆ క్షణంలోనే ఆమె కూతురు స్వస్థత పొందింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.