Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 2:1-6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

జ్ఞానుల సందర్శన

1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి, 2 "యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం" అన్నారు.

3 హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు. 4 కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, "క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?" అని వారిని అడిగాడు. 5 అందుకు వారు, "యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే,

6 ‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా!

యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు.

నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు" అని చెప్పారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు తూర్పుదిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. 2 వారు, "యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాం" అని చెప్పారు.

    3 హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడును అతనితో పాటు యెరూషలేము వారంతా కలవరపడ్డారు. 4 హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులనందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు. 5 అందుకు వారు, "యూదయ దేశంలోని బేత్లెహేములో" అని చెప్పారు, "ఎందుకంటే ప్రవక్త ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంది:

    6 " ‘యూదయ దేశంలోని బేత్లెహేమా,

    నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు;

    ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి

    నీలో నుండి వస్తాడు.’2:6 మీకా 5:2,4"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.