పసి పిల్లల వధ
16 ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.
17,18 "ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది.
రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.
వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది"
అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.
లూకా 2:39-40