4 కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, "క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?" అని వారిని అడిగాడు. 5 అందుకు వారు, "యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే,
6 ‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా!
యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు.
నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు" అని చెప్పారు.