Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 24:4-8

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

ఈ యుగం పరిణామాలు

4 యేసు వారితో ఇలా అన్నాడు, "ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. 5 చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు. 6 అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు. 7 జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. 8 ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    4 యేసు వారితో, "ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. 5 ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. 6 మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కాని మీరు కలవరపడకుండ జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం వెంటనే రాదు. 7 జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. 8 ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.