33 అందుకు పేతురు, "నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను" అని యేసుతో చెప్పాడు. 34 యేసు అతణ్ణి చూసి, "నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు" అన్నాడు. 35 పేతురు ఆయనతో, "నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను" అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
మార్కు 14:32-42; లూకా 22:39-46; యోహా 18:1; యోహా 18:15, 16, 17